• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నవంబర్ 6 వరకు ఓటర్ నమోదు’

కృష్ణా: నందిగామ రెవెన్యూ డివిజనల్ కార్యాలయ పరిధిలో అర్హులైన వ్యక్తులు ఎమ్మెల్సీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో కోరారు. ఆయన మాట్లాడుతూ.. 2021 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఫారం-18 ద్వారా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 6వ తేదీ అని తెలిపారు.

November 2, 2024 / 04:05 AM IST

ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ పదవిపై తర్జన భర్జన..!

ELR: ఉంగుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవికి ఎన్నడూ లేనంత పోటీ కానవస్తోంది. ఎవరికి వారే తమకు ఆ పదవి దక్కటం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏఎంసీ ఛైర్మన్ పదవికై టీడీపీ, జనసేన పార్టీలో తర్జన, భర్జన పడుతున్నారు. ఈ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠగా వేచి చూడాల్సిందే.

November 2, 2024 / 04:04 AM IST

మంత్రి భరత్‌ను కలిసిన కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్

KNL: కర్నూలు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. కె. వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి టీజీ భరతు కలిశారు. ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. అందులో శానిటేషన్, సెక్యూరిటీ బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మంత్రి అన్నారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

November 2, 2024 / 04:03 AM IST

డిగ్రీ 3,5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల

SKLM: ఎచ్చెర్లలో గల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3,5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ G. పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4 తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు.

November 2, 2024 / 04:03 AM IST

చందూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

KMR: చందూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని బోధన్ ఆర్డీవో వివేక్ మెహత శుక్రవారం తనిఖీ చేశారు. తప్పిదాలకు తావులేకుండా పక్కాగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. మండలంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను పక్కాగా చేపట్టాలన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ శాంత, ఎంపీడీవో నీలావతి, సిబ్బంది ఉన్నారు.

November 2, 2024 / 04:02 AM IST

పోలవరంపై మంత్రి సుభాష్ కీలక వ్యాఖ్యలు

E.G: పోలవరం ప్రాజెక్ట్ పై గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై మంత్రి సుభాష్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి మంత్రి మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయన్నారు. A అంటే అమరావతి, P అంటే పోలవరం నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

November 2, 2024 / 04:02 AM IST

నేటి నుంచి రాష్ట్ర రహదారుల మరమ్మతులు: మంత్రి

సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ పల్లె పండుగ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని శనివారం నుంచి రాష్ట్ర రహదారుల మరమ్మతులు చేపట్టనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. శుక్రవారం పెనుకొండ మండలం మావుటూరులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేశారు.

November 2, 2024 / 04:02 AM IST

జిల్లా అధికారులతో CM చంద్రబాబు సమీక్ష

SKLM: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చలు జరిపారు. జిల్లాకు కావాల్సిన నిధులు,పెండింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. అధికారులకు జిల్లా అభివృద్ధికి పలు సూచనలు చేశారు. CMతో పాటుగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

November 2, 2024 / 04:01 AM IST

కార్తీకమాసం నేపథ్యంలో భక్తులకు ఎస్పీవిజ్ఞప్తి

W.G: కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, కాలువల వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

November 2, 2024 / 04:01 AM IST

నేడు బిక్కనూరులో పర్యటించనున్న షబ్బీర్ అలీ

KMR: శనివారం బిక్కనూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఆయన ప్రారంభిస్తారని, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యకర్తలు హాజరై ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

November 2, 2024 / 04:00 AM IST

అరుణాచలం యాత్రకు స్పెషల్ బస్సులు

HYD: HYD, RR నుంచి అరుణాచల యాత్రకు వెళ్లేందుకు TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పౌర్ణమి వేళ శివుని అనుగ్రహం పొందడానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరుణాచలం వెళ్లాలనుకున్న ప్రయాణికులు 04023450033, 04069440000కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

November 2, 2024 / 04:00 AM IST

అడ్డగూడూరు మండలంలో నేడు ఎమ్మెల్యే సామేలు పర్యటన

BHNG: అడ్డగూడూరు మండలంలో నేడు ఎమ్మెల్యే మందుల సామేలు పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు మండలంలోని ధర్మారం, అడ్డగూడూరు, డి. రేపాక, చౌళ్లరామారం, కోటమర్తి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని మండల నాయకులు కోరారు.

November 2, 2024 / 04:00 AM IST

‘చంద్రబాబు చేతుల్లో రైతన్న దగా’

ATP: ఉమ్మడి అనంత జిల్లాలో రైతాంగం, ప్రకృతి చేతిలోనే కాకుండా సీఎం చంద్రబాబు చేతిలోనూ దగా పడ్డారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

November 2, 2024 / 04:00 AM IST

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో NH 342, 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు-కడప-విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు

November 2, 2024 / 04:00 AM IST

దీపం 2 పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రావణ్

GNTR: తాడికొండ అడ్డ రోడ్డు కామాక్షి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంటగదిలో ఇక భారం ఉండకూడదని కూటమి ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు.

November 2, 2024 / 03:52 AM IST