న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. రెండో ఇన్నింగ్స్‌లో NZని 174 పరుగులకే కట్టడి చేసింది. దీంతో భారత్ 147 రన్స్‌ను చేస్తే విజయం సాధిస్తుంది. జడేజా 5, అశ్విన్ 3, సుందర్, ఆకాశ్ దీప్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసి, 28 పరుగ...
VJA: జగన్ తన జల్సాల కోసం రూ.100ల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రజా ప్రయోజనాలు గాలికొదిలేసి తన విలాసాలకై నిబంధనలకు విరుద్ధంగా రాజమహల్లను తలదన్నే ప్యాలస్‌లను జగన్ నిర్మించుకున్నారని ఉమ ఆరోపించారు. ప్రజాధనాన్ని తన స్వార్థం కోసం సొంత భోగాలకు జగన్ వాడుకున్నారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
NLR: వాకాడు మండల పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో కొడుకు తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడు తుపాకుల రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచి రిమాండ్కు తరలించారు. వాకాడు సీఐ హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. తుపాకుల రమేశ్ మద్యానికి బానిసై తన కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో నిత్యం గొడవలు పడుతూ పలువురిని గాయపరచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్ ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. అలాగే ఓ ఆసుపత్రి లక్ష్యంగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ దాడులు జరపగా.. 25 మంది పౌరులు మృతి చెందారు. మరోవైపు లెబనాన్ జరిపిన దాడుల్లో 11 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది.
MHBD: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన ఛైర్మన్‌గా డోర్నకల్ మండలానికి చెందిన ఇస్లావత్ సుధాకర్ ఎన్నికయ్యారు. మొత్తం పాలకమండలి సభ్యులు 18 మంది ఎన్నికయ్యారు. ఇస్లావత్ సుధాకర్ ఎన్నిక కాబడం పట్ల పలువురు ఆయనని అభినందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం యువజన కాంగ్రెస్ విభాగంలో పనిచేస్తున్నాడు.
BDK: ములకలపల్లి మండలంలోని వేముకుంట గ్రామ సమీపంలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్లు స్థానికులు తహశీల్దార్‌కు సమాచారం అందించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు వేముకుంట గ్రామంలో ఆర్‌ఐ భద్రు ఆదివారం తనిఖీ నిర్వహించగా అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుర్తించారు. ఈ మేరకు రెండు ఇసుక లారీలను స్వాధీనం చేసుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించామని ములకలపల్లి ఆరి భద్రు తెలిపారు.
NRML: ఎన్నికల హామీలను నెరవేర్చేలా దృష్టి పెడుతున్నామని యూత్ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పథకం ప్రజలకు లబ్ధి చేకూర్చేదేనని వెల్లడించారు. నిరుపేదల కోసం పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ ఓ సినిమా చేస్తున్నాడు. ‘NBK-109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే షెడ్యూల్‌లో మూవీ క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తారట. ఈ షూట్ పూర్తియిన తర్వాత బాలయ్య తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
W.G: ఈ ఏడాది శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించింది.
AP: నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇదికాకుండా ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, అది బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
KMR: జిల్లాలో వరి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని కామారెడ్డి అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలంగాణ జన సమితి కార్యదర్శి నిజ్జన రమేశ్ తెలిపారు. రైతులు వడ్లు కల్లాలకు తెచ్చి 25 రోజులు కావస్తున్న ఇంకా తూకం ప్రారంభించలేదన్నారు. వర్షాలనికి రైతుల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ యాదవ్ రజినీకాంత్, నాగరాజు, పోచయ్య ఉన్నారు.
HYD: OU డెంటల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి పక్కన పారిశుద్ధ్యం పడకేసిందని స్థానికుల ఆరోపిస్తున్నారు. వ్యర్థాలను తొలగించే నాధుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. పరిసర ప్రాంతాల్లో వెలువడుతున్న వ్యర్థాలను తీసుకువచ్చి ఆసుపత్రి పక్కనే డంప్ చేస్తున్నారని, వైద్యం అందించే వైద్యులతో పాటు, రోగులు దుర్గంధ భరితపు వాసన పీల్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
VZM: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, 1 టూ 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్సైట్లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు.ఈ పరీక్షలకు దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.
TPT: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి నూతన ఈఓగా టి.బాపిరెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలను స్వీకరించారు. మొదట టి.బాపిరెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. అనంతరం పరిపాలన భవనంలో టి.బాపిరెడ్డి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
AP: టెట్ 2024 పరీక్ష ఫలితాలు రేపు మంత్రి లోకేష్ విడుదల చేయనున్నారు. ముందుగా నిన్న ఫలితాలను విడదల చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ప్రకటన వాయిదా పడింది. దాదాపు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 86.28 శాతం మంది పరీక్ష రాశారు. ఇక త్వరలోనే మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చ...