• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కరాటే క్రీడాకారునికి ఆర్ధిక సహాయం అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే

జనగాం: అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్‌కు ఎంపికైన క్రీడాకారునికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కరాటే క్రీడాకారుడు సార్ధక్ కుమార్ ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆదివారం ఆర్థిక సహాయం చేశారు. జాఫర్ గడ్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన సార్ధక్ కుమార్ ఈనెల 6వ తేదీన గోవాలో జరగనున్న అంతర్జాతీయ వరల్డ్ కప్ కరాటే ఛాంపియన్‌కు ఎంపికయ్యారు.

November 4, 2024 / 07:44 AM IST

మూసీలో దూకిన యువకుడి పరిస్థితి విషమం

SRPT: టేకుమట్లలోని పాత బ్రిడ్జి పైనుంచి దూకిన విజయవాడ యువకుడు యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, అతని శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. బాధితుడి కుటుంబానికి సమాచారం ఇచ్చామని కేతేపల్లి ఎస్సై శివతేజ తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న యశ్వంత్.. బైక్ అక్కడే నిలిపి రెయిలింగ్ పైనుంచి మూసీ నదిలో దూకాడు.

November 4, 2024 / 07:42 AM IST

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి

WGL: వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించు కోవచ్చన్నారు.

November 4, 2024 / 07:41 AM IST

కమ్మెసిన పొగమంచు

KMR: గాంధారి మండలం ముదేల్లి ఎక్స్ రోడ్డు, ముదేల్లి గ్రామాలను పొగమంచు కమ్మేసింది. కార్తీక మాసం ప్రారంభ సమయంలో చలి తీవ్రత పెరగడంతో సోమవారం ఉదయం గ్రామంలో పొగమంచు కురిసింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారు పొలాలకు వెళ్లే వారికి ఆ దృశ్యాలు కనువిందు చేశాయి.

November 4, 2024 / 07:41 AM IST

నేడు తిరుమలాయపాలెం ముఖ్యనేతలతో మంత్రి పొంగులేటి సమావేశం

KMM: తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో సోమవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి పీఏ తెలిపారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి పొంగులేటి గ్రామాల వారీగా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.

November 4, 2024 / 07:41 AM IST

కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

కెనడలో బ్రాంప్టన్‌లోని హిందూ మహాసభ మందిరంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ప్రతి కెనడియన్‌కు ఉందని ప్రకటించారు. పోలీసులు తక్షణమే స్పందించి భక్తులను రక్షించారని, ఈ ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు.

November 4, 2024 / 07:35 AM IST

‘వారపు సంత షెడ్లు ధ్వంసం’

ASR: డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల పంచాయతీ సంతబయలులో ఏర్పాటు చేసిన వారపు సంత షెడ్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు సోమవారం మీడియాకు తెలిపారు. అర్థరాత్రి సమయంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని, దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

November 4, 2024 / 07:34 AM IST

బీసీ కుల గణనపై రేపటి లోపు డెడికేషన్ కమిషన్ : సీఎం

HYD: హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

November 4, 2024 / 07:34 AM IST

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్… నలుగురి మృతి

E.G: జిల్లాలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ గురై నలుగురి మృతి చెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 4, 2024 / 07:33 AM IST

మన దుర్గమ్మకు కార్తీక మాసం పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగ్‌సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు కార్తీక మాసం మొదటి సోమవారం తదియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందు వాసరే పురస్కరించుకొని ఆలయ ఆచార సాంప్రదాయ పద్ధతిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. అనంతరం మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు.

November 4, 2024 / 07:32 AM IST

కరీంనగర్ కు బోధన్ నుంచి రైలు ప్రారంభం

KNR: కరీంనగర్ కు బోధన్ నుంచి రైలు ప్రారంభమైంది. రైల్ నెంబర్ 07893 ఇది బోధన్‌లో ఉ.4.15గంటలకు ప్రతిరోజు బయలుదేరి కరీంనగర్‌కు ఉ. 8 గంటలకు చేరుకోనుంది. బోధన్ నుంచి నిజామాబాద్ మీదుగా కరీంనగర్ టూ సిర్పూర్ కాగాజ్నగర్ వరకు ఈ రైలు పట్టాలెక్కడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

November 4, 2024 / 07:30 AM IST

జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ప్రారంభం

MLG: జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

November 4, 2024 / 07:29 AM IST

విజయనగరం శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు

VZM: పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో ఆలయ అర్చకులు శివుడికి పాలు, పెరుగు, తేనే, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.

November 4, 2024 / 07:29 AM IST

రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే సత్యం

KNR: రైతులు వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు.బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆదివారం నూతన పాల కేంద్ర భవనాన్ని కరీంనగర్ జిల్లా డైరీ ఛైర్మన్ చల్మెడ రాజేశ్వరరావుతో ఆయన కలిసి ప్రారంభించారు.పాడి పరిశ్రమకు పోటీ లేదని, ప్రతి రైతు పాడి పరిశ్రమపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలన్నారు.

November 4, 2024 / 07:29 AM IST

అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధింపు

ELR: అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నీలాద్రిపురానికి చెందిన మాధురికి నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందినసుధాకర్ అలియాస్ మహేశ్ మూడేళ్ల కిందటవివాహం జరిగింది. అప్పుడు కొంత మొత్తం కట్నంగాఇచ్చారు. ఆదివారం చేబ్రోలు పోలీసులకు పిర్యాదు చేశారు.

November 4, 2024 / 07:27 AM IST