KDP: ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో మడూరు రోడ్డు క్రాస్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చాపాడు మండలం మడూరుకు చెందిన మహబూబ్ షరీఫ్ (50) మృతి చెందాడు. ప్రొద్దుటూరు నుంచి తన స్వగ్రామం మడూరుకు టీవీఎస్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా జమ్మలమడుగు వైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. తలకు గాయాలై మహబూబ్ షరీఫ్ అక్కడికక్కడే చనిపోయాడు.
కోనసీమ: తొలి కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి తూ.గో జిల్లాలోని శివాలయాలకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈవో లక్ష్మీనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ఈ నెలంతా నదీ స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు చేయడం చాలా మంచిదని, శుభ ఫలితాలు వస్తాయని అర్చకులు తెలిపారు.
నెల్లూరు: సోమశిల జలాశయంలో నీటినిల్వ 70 టీఎంసీల స్థాయిని దాటింది. ప్రస్తుతం జలాశయంలోకి 20,234 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం నుంచి కండలేరుకు 10వేల క్యూసెక్కులు, సంగం ఆనకట్టకు 2,100, ఉత్తరకాలువకు 700 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా జలాశయానికి ఇప్పటికే 110 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 40 టీఎంసీలు కండలేరుకు తరలించారు.
నెల్లూరు: పొదలకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు పీఎం సూర్యఘర్‌పై సమావేశం నిర్వహిస్తామని విద్యుత్ డీఈ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.
TG: ఉమ్మడి జిల్లాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ వాయిదా పడింది. ఈనెల 11న కొన్ని జిల్లాల్లో జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా అయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జరగాల్సిన విచారణ వాయిదా వేశారు. బీసీ కులగనణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్లే వాయిదా వేస్తున్నట్లు బీసీ కమిషన్ తెలిపింది. సవరించిన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
NTR: 11 కేవీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఫీడర్, స్క్రూ బ్రిడ్జి విద్యుత్ ఉపకేంద్ర పరిధిలో సోమవారం విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బెంజి సర్కిల్, మైత్రేయవీధి, శ్రీరాంనగర్, చంద్రమౌళిపురం MG రోడ్, ఫకీరుగూడెం, ప్రగతినగర్ లో విద్యుత్ సరఫరా ఉండదని EE పి. రవీంద్రబాబు చెప్పారు. ఆయా ప్రాంతాల వారు సహకరించాలని ఆయన కోరారు.
ఖమ్మం: నగరంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ తెలిపారు. ముందుగా మంత్రి తుమ్మల ముస్తాఫనగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఇక ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
HYD: హైదర్నగర్ గ్రామ పరిధిలోని దర్గా వద్ద ముస్లిం మైనార్టీ ప్రజలు పెద్దయెత్తున నిర్వహించిన గ్యార్వీ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని మత సామరస్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
MBNR: మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో ఆదివారం జరిగింది. CI గాంధీ కథనం.. MBNR లోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు (3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. గమనించి పోలీసులకు అప్పగించారు.
HYD: చెరువుల పునరుద్ధరణపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరుకు స్టడీ టూర్ వెళ్లనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా మరి కొంతమంది ఇందులో పాల్గొననున్నారు. అక్కడచెరువుల పునరుజ్జీవం ఎలా జరిగిందో స్టడీ చేస్తారు. ఈ టూర్ అనంతరం ఇక్కడకు వచ్చి బాచుపల్లిలోని ఎర్రకుంటచెరువు, మాదాపూర్ సున్నంచెరువు, కూకట్పల్లిలోని నల్లచెరువుల పునరుద్ధరణ చేపడతారు.
గద్వాల: మల్దకల్ మండలం బీజ్వరం గ్రామానికి చెందిన వడ్డెర రాజేశ్వరి అనే అమ్మాయి మృతి చెందిన విషయం తెలుసుకొని ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం రాబోతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు, యువత, మహిళా సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రిపోర్టర్స్ ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొనాలన్నారు.
TG: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ఇంకా పెద్దపులి ఆచూకీ దొరకలేదు. సూర్యపూర్, మేదన్పూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు గుర్తించారు. అంబుగాం, పెంగల్ పహాడ్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తోంది. పులి సంచారంతో జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి అడుగుజాడలను కనిపెడుతున్నారు.
GDWL: జిల్లాలో సోమవారం ఆ గ్రామాల్లో ఉన్న మీ సేవ కేంద్రాలను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు మీసేవ నిర్వాహకులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మీ సేవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా అందరూ వేడుకల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.
BDK: గుండాల మండలంలోని మామకన్ను 33కేవీ విద్యుత్ సబ్స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుండాల మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. గుండాల మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్తు శాఖ అధికారులు కోరారు.
KKD: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటన వివరాలు ఇలా వున్నాయి. ఉదయం 11 గంటలకు గొల్లప్రోలు ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.11:30కి పిఠాపురంలో టీటీడీ కల్యాణ మండపంలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30కి పి.వెంకటాపురంలో, 1:30కి కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.