• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ

ASF: అడవులు, వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ మజారుద్దీన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో అడవులను సందర్శించారు. ఆయన అడవికి సమీపంలో ఉన్న రైతులు తమ పంట వ్యర్థాలను నిప్పులు పెట్టవద్దని సూచించారు. అడవులను ధ్వంసం చేసినా, వన్యప్రాణులకు హాని కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 27, 2024 / 08:36 AM IST

‘ఆయన హయాంలో పని చేయటం నా అదృష్టం’

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన హయాంలో పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

December 27, 2024 / 08:35 AM IST

అయిజ పెద్ద వాగు బ్రిడ్జ్ ప్రమాదం.. వ్యక్తి మృతి

GDWL: అయిజ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్ణంగా నిర్మించిన పెద్ద వాగు బ్రిడ్జ్‌పై గురువారం డేవిడ్ అనే యువకుడు ప్రమాదానికి గురై కర్నూల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. బ్రిడ్జ్ స్లాబ్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటంతో వాహనదారులు గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై మూడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

December 27, 2024 / 08:34 AM IST

‘ఆయన నాయకత్వంలో పనిచేసినందుకు గర్వపడుతున్నా’

అనంతపురం: భారత మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో మన్మోహన్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయడంతో ఆయన నాయకత్వంలోని సాకారం అయిందన్నారు.

December 27, 2024 / 08:32 AM IST

కల్వర్టుకు ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం

MDK: చిన్నశంకరంపేట మండలం సూరారం శివారులో శుక్రవారం ఉదయం కారు బోల్లా పడింది. సూరారం నుంచి ధర్పల్లి వెళ్లే రోడ్డు ఫీడ్ మిల్ ఫ్యాక్టరీ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.

December 27, 2024 / 08:32 AM IST

నేడు కిష్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన

నిర్మల్: కిస్టాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు అసెంబ్లీ కన్వీనర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఎన్నుకున్న 201 బూత్ కమిటీ సభ్యులను సన్మానించనున్నారు.

December 27, 2024 / 08:32 AM IST

నేటి నుంచి ప్రారంభం కానున్న కందికొత్తుల పండుగ

PPM: గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక అయినా కందికొత్తులు పండుగ నేటి నుంచి ప్రారంభం కానున్నదని గిరిజన సంఘాలునాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొండపోడులో సాగు చేసిన కందులు జొన్నలు, రాగులు, కొర్రలు వరి పంటను ముందుగా గిరిజన దేవతకు నైవేద్యంగా సమర్పిస్తాము. అనంతరం వాటి ఆహారంగా స్వీకరిస్తామని పండగ జరిగే వరకు పంట చేతికొచ్చిన ఆహారం తీసుకోమని తెలిపారు.

December 27, 2024 / 08:30 AM IST

‘పత్తి రైతులకు ఆశాజనకంగా పత్తి అమ్మకాలు’

GNTR: పత్తి రైతులకు ఆశాజనకంగా ప్రతి అమ్మకాలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను హరిచంద్రపురం, పెద్దపరిమి గ్రామాలలో రైతులు పత్తి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,500 ఉందని, మిల్లర్ల వద్ద రూ.7,300 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. పత్తి పంట దిగుబడితో పాటు ధరలు ఆశాజనకంగా ఉన్నారు.

December 27, 2024 / 08:30 AM IST

గోదావరిఖని RTC డిపోలో పాముల కలకలం

KNR: గోదావరిఖని RTC డిపో ఆవరణలో పాముల సంచారంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో చుట్టూ ఉన్న ప్రహరీ అవతల చెత్తాచెదారం ఉండటంతో పాములు తిరుగుతున్నాయి. ఇటీవల ఒకరికి పాము కాటు వేయడంతో చికిత్స పొందుతున్నారు. డిపో ఆవరణలో ఇనుప తుక్కు ఉండటం వల్ల పాములు అధికమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

December 27, 2024 / 08:30 AM IST

అయ్యప్ప మహా పడిపూజలో హరీశ్ రావు

SDPT: సికింద్రాబాద్ అశోక్ నగర్ టక్కర బస్తీలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

December 27, 2024 / 08:30 AM IST

ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో గుడిసె కృష్ణమ్మ పూజలు

KRNL: ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బంగారమ్మ దేవతకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బంగారమ్మ పూజలు గ్రామ ఆచారంగా నిలిచిన విషయాన్ని కృష్ణమ్మ గుర్తుచేశారు.

December 27, 2024 / 08:29 AM IST

విజయవాడలో వెరైటీ దొంగ అరెస్ట్

NTR: విజయవాడలో నిన్న ఓ దొంగను కమిషనర్ రాజశేఖర్ బాబు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు (D) పొన్నూరుకు చెందిన మోహన్ రావు ఒంటిపై బట్టలు లేకుండా చోరీలు చేస్తుంటాడు. ముందుగా ఏ ఇంట్లో దొంగతనం చేయాలో రెండు మూడురోజులు ముందే ప్లాన్ వేసుకుంటాడు. పక్కనే ఖాళీ స్థలం, తుప్పలు ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తాడు.

December 27, 2024 / 08:29 AM IST

నేడు అనంతగిరిలో జీసీసీ చైర్మన్ పర్యటన

ASR: అనంతగిరి మండలంలో శుక్రవారం జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ కుమార్ పర్యటించనున్నారని క్యాప్ కార్యాలయం నుంచి తెలిపారు. ముందు గా కాశీపట్నం జీసీసీ గుడౌన్ పరిశీలించిన అనంతరం డీపోలను తనిఖీ చేయనున్నారు. జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరకులు, బియ్యం, తదితర వాటిపై గిరిజనులను అడిగి తెలుసుకుంటారని వారు తెలిపారు.

December 27, 2024 / 08:27 AM IST

మారుతీ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం

కృష్ణా: మచిలీపట్నం బందరు కోటలోని మారుతీ స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం కొంత మంది వ్యక్తులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆలయ కమిటీ సభ్యులు అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గురువారం వారు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని వారు కోరారు.

December 27, 2024 / 08:27 AM IST

మన్మోహన్ పాలనలోనే 3జీ, 4జీ, NIA ప్రారంభం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీ కాలంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి. 3జీ, 4 జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఆయన హయాంలోనే ఊపందుకుంది. వివిధ పథకాల కింద నగదు సహాయాన్ని ప్రభుత్వం ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే(DBT) ప్రక్రియ ప్రారంభమైంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఆయన నేతృత్వంలో అవతరించింది.

December 27, 2024 / 08:26 AM IST