• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి పొంగులేటి నేటి పర్యటన వాయిదా

KMM: ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా మంత్రి పొంగులేటి అధికార పర్యటన వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.

December 27, 2024 / 08:10 AM IST

శ్రీవారి సముద్రంలో స్పీడ్ బోట్లు ఏర్పాటు

NGKL: కొల్లాపూర్ మండలంలోని సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌లో స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తామని పర్యాటకశాఖ జిల్లా అధికారి నర్సింహ చెప్పారు. గురువారం దేవస్థానం అధికారి జైపాల్ రెడ్డితో కలిసి రిజర్వాయర్‌ను సందర్శించారు.

December 27, 2024 / 08:09 AM IST

మచిలీపట్నంలో కానిస్టేబుల్ సామర్థ్య పరీక్షలు

కృష్ణా: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు ఈ నెల 30వ తేదీ నుంచి మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్నాయని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దేహదారుఢ్య పరీక్షలు ప్రక్రియ మొత్తం ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

December 27, 2024 / 08:07 AM IST

మాజీ ప్రధాని మృతి దేశానికి తీరనిలోటు: అనకాపల్లి ఎంపీ

AKP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ప్రధాని మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు.

December 27, 2024 / 08:07 AM IST

స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం

HYD: ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు.

December 27, 2024 / 08:07 AM IST

‘దేశ ఆర్ధికాభివృద్ధికి ఆయన కృషి గుర్తుండిపోతుంది’

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ జీ మరణవార్త గురించి విని చాలా బాధపడ్డాను. దేశ ఆర్థిక రంగాన్ని స్కేలింగ్ చేయడంలో మన్మోహన్ సహకారం అపారమైనది. కీలక ఆర్థిక సంస్కరణల అమలు సహా భారతదేశ వృద్ధి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఖ్యాతి రాజకీయాలకు అతీతంగా విస్తరించింది’ అని పేర్కొన్నారు.

December 27, 2024 / 08:06 AM IST

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NLR: గూడూరు నిమ్మకాయల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి గొర్రెల లోడుతో చిల్లకూరు సంతకు వస్తున్న మినీ వ్యాన్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మినీ లారీలో ఉన్న ఓ వ్యక్తి సంఘటనా స్దలంలోనే చనిపోగా మిగిలిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరుకు అంబులెన్సులో తరలించారు.

December 27, 2024 / 08:05 AM IST

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: ఎంపీ

ప్రకాశం: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఒంగోలు ఎంపీ శ్రీనివాసుల రెడ్డి సంతాపం తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు ఒక అని ట్వీట్ చేశారు.

December 27, 2024 / 08:03 AM IST

బియ్యం రవాణాపై కేసు నమోదు

కాకినాడ: పోర్టు నుంచి 1,064 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాసరావు ఫిర్యాదుపై పోర్టు సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ నెల 20న స్వాధీనం చేసుకున్న బియ్యానికి సంబంధించి లవన్ ఇంటర్నేషనల్ సంస్థపై కేసు నమోదు చేశారు. సంస్థ ఉద్యోగులు అమిత్ కుమార్ జైన్, రవికుమార్‌పై పలు సెక్షన్లతో కేసు నమోదైంది.

December 27, 2024 / 08:03 AM IST

నేడు కైకలూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు గుంటూరులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరై రాత్రి 9.30 గంటలకు వరహాపట్నంలో స్వగృహానికి చేరుకుంటారన్నారు.

December 27, 2024 / 08:01 AM IST

సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

HYD: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన జీవో నెం 60 ప్రకారం వారికి జీత భత్యాలు చెల్లించడంతో పాటు రూ. 10 లక్షల జీవిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

December 27, 2024 / 08:00 AM IST

రాజుపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

GNTR: రాజుపాలెం పోలీస్ స్టేషన్‌ను సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించి సీజ్ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నరు.

December 27, 2024 / 07:59 AM IST

హత్య కేసులో నిందితుల అరెస్ట్

KDP: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన వెంకటరమణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. ఈనెల 22వ తేదీన రాత్రి బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన నాటక ప్రదర్శనలో ఇరువురు మధ్య తలెత్తిన వివాదం హత్య వరకు దారితీసిందని అన్నారు. కోపంతోనే వెంకటరమణను, రమణారెడ్డి అతని ఇద్దరు కుమారులు చంపినట్లు తేలింది.

December 27, 2024 / 07:59 AM IST

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: భట్టి

KMM: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.

December 27, 2024 / 07:58 AM IST

గోదావరి తీరంలో సందడి చేస్తున్న అందమైన పక్షులు

కోనసీమ: ఆలమూరు మండలం ఆలమూరు, జొన్నాడ గోదావరి లంక భూముల్లో, ఇసుక తిన్నెల్లో బార్ హెడెడ్ గుస్ బాతులుగా పేరొందిన విహంగాలు అతిధులుగా వచ్చి సందడి చేస్తున్నాయి. సముద్రమట్టానికి 30000 అడుగుల ఎత్తులో ఎగరడం వీటి ప్రత్యేకత. హిమాలయాల ఆవల నుంచి శీతాకాలపు అతిథులుగా మన గోదావరి తీరానికి ఈ అందమైన వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి

December 27, 2024 / 07:56 AM IST