NLR: గూడూరు నిమ్మకాయల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి గొర్రెల లోడుతో చిల్లకూరు సంతకు వస్తున్న మినీ వ్యాన్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మినీ లారీలో ఉన్న ఓ వ్యక్తి సంఘటనా స్దలంలోనే చనిపోగా మిగిలిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరుకు అంబులెన్సులో తరలించారు.