WNP: శివ చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరచింత మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాల వార్షికోత్సవం, కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివ చౌడేశ్వరి ఆలయంలో చౌడేశ్వరి మాతాకి పంచామృతాభిషేకం, మహా హారతి అనంతరం 10 గంటలకు హోమం నిర్వహిస్తున్నామని కార్యనిర్వహణ అధికారులు తెలిపారు.
KMR: ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామానికి చెందిన సింగసాని గంగారం గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాకి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు.
ADB: కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఈద్గా నిర్మాణానికి రూ.3.25 లక్షలు మంజూరయ్యాయి. సోమవారం ప్రొసీడింగ్ కాపీని ఓలా మాజీ సర్పంచ్ హైమద్ పాషాకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలియ చేశారు.
WNP: గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, కాస్మోటిక్ అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాల ఆవరణలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 588 అడుగులు (305 టీఎంసీలు) నీరు ఉంది. ఇన్ ఫ్లో 30,834 క్యూసెక్కులుండగా.. జల విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ, వరద కాల్వ, ఎస్ఎల్బీసీకి మొత్తం 47,834 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
E.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సోమవారం ఉదయం ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందరు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పట్ల మంత్రి సుభాష్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అండగా ఉంటుందని మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సీఎం చంద్రబాబు ప్రకటించారని చెప్పారు.
KMR: జిల్లా భవన నిర్మాణ కార్మికులు తమ హక్కులు సాధించుకునే దిశలో పనిచేయాలని రాష్ట్ర కార్యదర్శి ఉప్పు సాయికుమార్ తెలిపారు. కార్మికులందరు ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా కార్మికులకు వర్తించే విధంగా చూడాలన్నారు. ఈ నెల 18న నాలుగో మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఐలయ్య, శీను, రజాక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
CTR: నగరి రూరల్ మండలం బుగ్గ కండ్రిగ నందు గ్రామ దేవత శ్రీ మనీషమ్మ నూతన ఆలయ అష్ట బంధన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు వేద పండితులు రోజాకి స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRN: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై MLC జీవన్ రెడ్డి మరోమారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులు పొందడం వారి హక్కు అని వివరించారు. కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కోరారు.
AKP: కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ లగ్జరీ నాన్ స్టాప్ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో సాంకేతిక సమస్యలతో పాయకరావుపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నేషనల్ హైవే వద్ద ఆగిపోయింది. సుమారు గంట వరకు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన భార్య ముందు అంకుల్ అని పిలిచినందుకు ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. భార్యతో కలిసి రోహిత్ అనే వ్యక్తి బట్టల దుకాణానికి వెళ్లాడు. అక్కడ షాపు యజమానితో జరిగిన సంభాషణలో దుకాణదారుడు రోహిత్‌ని అంకుల్ అని సంభోదించాడు. దీంతో కోపోద్రిక్తుడైన రోహిత్.. తన స్నేహితులను తీసుకొచ్చి షాపు యజమానిపై కర్రలు, బెల్టులతో దాడి చేశాడు.
MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని సోమవారం అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది.
SKLM: ఆమదాలవలస పట్టణంలో 12వ వార్డ్ పరిధి లక్ష్మీ నగర్ వీధిలో శ్రీ దేవి సినిమా హాల్‌కు ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభానికి పచ్చని తీగలు అలుముకున్నాయి. చిన్న గాలి వేసినా విద్యుత్ తీగలు నుంచి నిప్పులు రాలుతున్నాయని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభంపై అలుముకున్న పచ్చని తీగలు తొలగించి సమస్య పరిష్కరించాలని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
WGL: నల్లబెల్లి మండలం చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తుగా సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో నిర్వహించే ధర్నాకు మాజీ సర్పంచులు వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి సమస్యలను పక్కదారి పట్టించడం తగదని మాజీ సర్పంచ్‌ల ఫోరం నాయకులు అన్నారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి పొలాల్లోకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసన్న కారు ఓవర్ టేక్ చేయబోయి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఊపిరి పీల్చుకున్నారు.