• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

NLR: గూడూరు నిమ్మకాయల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి గొర్రెల లోడుతో చిల్లకూరు సంతకు వస్తున్న మినీ వ్యాన్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మినీ లారీలో ఉన్న ఓ వ్యక్తి సంఘటనా స్దలంలోనే చనిపోగా మిగిలిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరుకు అంబులెన్సులో తరలించారు.

December 27, 2024 / 08:05 AM IST

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: ఎంపీ

ప్రకాశం: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఒంగోలు ఎంపీ శ్రీనివాసుల రెడ్డి సంతాపం తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు ఒక అని ట్వీట్ చేశారు.

December 27, 2024 / 08:03 AM IST

బియ్యం రవాణాపై కేసు నమోదు

కాకినాడ: పోర్టు నుంచి 1,064 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాసరావు ఫిర్యాదుపై పోర్టు సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ నెల 20న స్వాధీనం చేసుకున్న బియ్యానికి సంబంధించి లవన్ ఇంటర్నేషనల్ సంస్థపై కేసు నమోదు చేశారు. సంస్థ ఉద్యోగులు అమిత్ కుమార్ జైన్, రవికుమార్‌పై పలు సెక్షన్లతో కేసు నమోదైంది.

December 27, 2024 / 08:03 AM IST

నేడు కైకలూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో జరిగే రెవిన్యూ సదస్సులో పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు గుంటూరులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరై రాత్రి 9.30 గంటలకు వరహాపట్నంలో స్వగృహానికి చేరుకుంటారన్నారు.

December 27, 2024 / 08:01 AM IST

సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

HYD: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన జీవో నెం 60 ప్రకారం వారికి జీత భత్యాలు చెల్లించడంతో పాటు రూ. 10 లక్షల జీవిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

December 27, 2024 / 08:00 AM IST

రాజుపాలెం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

GNTR: రాజుపాలెం పోలీస్ స్టేషన్‌ను సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించి సీజ్ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నరు.

December 27, 2024 / 07:59 AM IST

హత్య కేసులో నిందితుల అరెస్ట్

KDP: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన వెంకటరమణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. ఈనెల 22వ తేదీన రాత్రి బోరెడ్డిగారిపల్లె వద్ద జరిగిన నాటక ప్రదర్శనలో ఇరువురు మధ్య తలెత్తిన వివాదం హత్య వరకు దారితీసిందని అన్నారు. కోపంతోనే వెంకటరమణను, రమణారెడ్డి అతని ఇద్దరు కుమారులు చంపినట్లు తేలింది.

December 27, 2024 / 07:59 AM IST

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: భట్టి

KMM: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.

December 27, 2024 / 07:58 AM IST

గోదావరి తీరంలో సందడి చేస్తున్న అందమైన పక్షులు

కోనసీమ: ఆలమూరు మండలం ఆలమూరు, జొన్నాడ గోదావరి లంక భూముల్లో, ఇసుక తిన్నెల్లో బార్ హెడెడ్ గుస్ బాతులుగా పేరొందిన విహంగాలు అతిధులుగా వచ్చి సందడి చేస్తున్నాయి. సముద్రమట్టానికి 30000 అడుగుల ఎత్తులో ఎగరడం వీటి ప్రత్యేకత. హిమాలయాల ఆవల నుంచి శీతాకాలపు అతిథులుగా మన గోదావరి తీరానికి ఈ అందమైన వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి

December 27, 2024 / 07:56 AM IST

రేపు DLSA స్టేనో, టైపిస్టు నైపుణ్య పరీక్షలు

కామారెడ్డి: జిల్లా న్యాయాధికారి సేవ సంస్థ(DLSA) ఆధ్వర్యంలో ఇటీవలే OMR బేస్డ్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంపికైన అర్హులకు రేపు 2 గం.లకు స్టేనో, 3.30గం.లకు టైపిస్టు పోస్టులకు కామారెడ్డిలోని RK పీజీ కళాశాలలో నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వివరాలకు వెబ్‌సైట్‌లో https://kamareddy.dcourts.gov.in సందర్శించాలన్నారు.

December 27, 2024 / 07:53 AM IST

ప్రభుత్వ నిర్ణయం పున:సమీక్షించాలి: భూమన్న యాదవ్

NRML: సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కొరకు నిరవధిక దీక్ష చేపట్టగా, ప్రభుత్వం ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునః సమీక్షించాలని ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ శుక్రవారం ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

December 27, 2024 / 07:53 AM IST

దేశంలో తగ్గిన పులుల మరణాలు

దేశంలో పులుల మరణాలు తగ్గినట్లు ఓ నివేదికలో తేలింది. గత ఏడాదిలో మొత్తం 182 పులులు మరణించాయని.. ఈ ఏడాదిలో 122 మరణించినట్లు ఆ నివేదిక పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 44, మహారాష్ట్రలో 21 ఉన్నాయని తెలిపింది. పులుల సంరక్షణపై చర్యలు తీసుకోవటం, అడవుల్లో వేటగాట్లను కట్టడి చేయటం, వణ్యపాణి చట్టాలను కఠినంగా అమలు చేయటం వల్ల పులుల మరణాలు తగ్గినట్లు NTCA చెప్పింది.

December 27, 2024 / 07:52 AM IST

నేడు మిక్కినేనిపల్లెలో ‘రెవెన్యూ సదస్సు’

NDL: సంజామల మండల పరిధిలోని మిక్కినేనిపల్లెలో శుక్రవారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ పి.అనిల్ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దస్తగిరి స్వామి చావిడి ఆవరణంలో ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహశీల్దార్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.

December 27, 2024 / 07:48 AM IST

రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు!

HYD: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన పార్థివ దేహానికి శనివారం అంత్యక్రియలు జరుగుతాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని విలేకరులతో వేణుగోపాల్ అన్నారు.

December 27, 2024 / 07:46 AM IST

రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి సిద్ధం!

HYD: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పూర్తయిన వాటితో పాటు వివిధ దశల్లో ఉన్నవి పూర్తిచేసి మొత్తం 94,204 ఇళ్లకు పట్టాలు అందించాల్సి ఉండగా వాటిని కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

December 27, 2024 / 07:46 AM IST