NDL: సంజామల మండల పరిధిలోని మిక్కినేనిపల్లెలో శుక్రవారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ పి.అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దస్తగిరి స్వామి చావిడి ఆవరణంలో ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహశీల్దార్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.
HYD: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన పార్థివ దేహానికి శనివారం అంత్యక్రియలు జరుగుతాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని విలేకరులతో వేణుగోపాల్ అన్నారు.
HYD: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పూర్తయిన వాటితో పాటు వివిధ దశల్లో ఉన్నవి పూర్తిచేసి మొత్తం 94,204 ఇళ్లకు పట్టాలు అందించాల్సి ఉండగా వాటిని కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన వారికే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామ చిన్న బస్టాండు వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విలోచవరం గ్రామానికి చెందిన బొజ్జల రమేష్ గోదావరిఖని నుంచి మంథని వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొనడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో 108లో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారత్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. 311/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతుంది. ఈ క్రమంలో స్మిత్ సూపర్ సెంచరీతో(139*) టెస్టుల్లో తన 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో స్మిత్, స్టార్క్ ఉన్నారు. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 454/7.
NLG: నార్కట్ పల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గం.కు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తన చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 50 మంది లబ్దిదారులకు అందజేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలోని లబ్దిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో జీవనోపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. బ్యూటీషియన్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్ ఉద్యోగాల శిక్షణ కోసం ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 27, 28 తేదీలలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే గ్రామీణ ప్రాంత పేదలకు ఏడాదికి 100 రోజుల పని పేరుతో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పలు పథకాల కింద లబ్ధిదారులకు అందే సాయం ఆధార్ లింక్‌తో నేరుగా ఖాతాలలో జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ.. కొందరు పేద విద్యార్థులు చదువుకునేలా రూల్స్ తీసుకొచ్చారు.
కృష్ణా: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యులుగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సేవలు మరువలేనివన్నారు.
ATP: హైదరాబాద్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్‌ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ గురువారం కలిశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మారుమూల గ్రామం నుంచి ప్రజలు పట్టణాలకు వైద్యం కోసం రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
MNCL: ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు.
GNTR: రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల ఆర్థికవేత్త. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణల ఆద్యులలో మన్మోహన్ ఒకరు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని తెలిపారు.
కోనసీమ: నూతన సంవత్సరం సందర్భంగా పెన్షన్‌దారులకు ఒకరోజు ముందుగానే డిసెంబరు 31న పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 2,38,012 మంది లబ్ధిదారులకు రూ.100.04 కోట్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.
W.G: పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో రూ.43.50 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభిస్తారని సర్పంచ్ వెలగల సుగుణ గురువారం తెలిపారు. ఈ భవనాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై భవన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం రూ.6 లక్షల పంచాయతీ నిధులు వెచ్చించి మైనర్ పనులను పూర్తి చేశారన్నారు.