BHPL: భూపాలపల్లి కేటీకే-1 ఇంక్లెన్ను ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య సందర్శించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు నిత్యం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బుచ్చయ్య తెలిపారు. ఫిట్ సెక్రటరీ బండి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి రాములు, తదితరులు ఉన్నారు.
అన్నమయ్య: నిమ్మనపల్లె మండలంలో విషాదఘటన జరిగింది. రాచవీటివారిపల్లి గ్రామం, ఎగువమాసిరెడ్డిగారిపల్లెకు చెందిన తుపాకుల బోయకొండప్ప కొడుకు చిన్నరాముడు(45), ఆదివారం గ్రామంలోని పెద్దచెరువుకు చేపల వేటకు వెళ్లాడు. వలలో చిక్కుకొని నీటిలో గల్లంతవడంతో గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో సోమవారం ఉదయం మృతదేహం వెలికితీశారు.
NRPT: నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గందే అనసూయ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులు చాలా కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మాలన్నారు.
AP:రాష్ట్ర కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలో మునగాల మండలం ఆకుపాముల వద్ద IAS వాణీ ప్రసాద్ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదం నుంచి వాణీప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారని.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
AP: టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటన చేశారు. ఈ ఫలితాల్లో 50.75 శాతం మంది అర్హత సాధించారు. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఫలితాల కోసం https//:cse.ap.gov.in చూడండి.
ADB: తాంసి మండలం జామిడి గ్రామంలోని ఓ పంట పొలంలో విద్యుత్ తీగలు చేతికి అందేలా వేలాడుతున్నాయి. దీంతో ప్రాణాపాయం పొంచి ఉందని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఢిల్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గాలి కాలుష్యం మితిమీరిపోయింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1900గా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా లాహోర్ చెత్త రికార్డును సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో వారం పాటు ప్రైమరీ స్కూల్స్ మూసివేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. ప్రజలందరూ మాస్క్ ధరించాలని...
అనంతపురం: గుత్తి మండలంను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ.. సోమవారం గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ.. గుత్తి మండలంతో పాటు మరో 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.
MDK: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, సరియైనది కాదన్నారు.
E.G: ఉమ్మడి తూ.గో జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్డు మార్గంలో పిఠాపురం బయలుదేరి వెళ్లారు.
PPM: వీరఘట్టం మండలం, వండువ గ్రామంలో కొలువైన ‘శ్రీశ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి’ వారికి పాలకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి.కళావతి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని భక్తి శ్రద్దలతో పూజలు చేసినట్లు కళావతి తెలిపారు. ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
HYD: ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ మాజీ ఇంచార్జీ వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం చార్మినార్ లాల్ దర్వాజా ప్రాంతాలలో వెంకటేష్ ఇంటింటికి తిరిగి సమగ్ర కుటుంబ సర్వేకు చెప్పారు.
వికారాబాద్: సర్పన్ పల్లి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్పేట్ మండలం మదనపల్లి తండాకు చెందిన రెడ్యా నాయక్ సర్పన్ పల్లి ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమావశాత్తు జలాశయంలో కాలుజారీ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ఎన్నికల సమయంలో హోవార్డ్ యూనివర్సిటీలోనే ఉండనున్నారు. అక్కడే ఉండి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ‘ద బ్లాక్ హార్వర్డ్’గా పేరుగా గాంచిన ఈ సంస్థలో కమలాహారిస్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు అక్కడ కొంత సమయం గడపటం ఆమెకున్న అలవాటు.
PDPL: తూకంలో తేడా వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.