• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దేశ రాజకీయాల్లో మన్మోహన్ అగ్రగణ్యుడు: నడ్డా

మాజీ ప్రధాని మన్మోహన్ హఠాన్మరణం వార్త విని షాక్‌కు గురైనట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మన్మోహన్ విజ్ఞానం అపారమని కొనియాడారు. దేశం ఆయన నాయకత్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో మన్మోహన్ అగ్రగణ్యుడని కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగిన ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు.

December 27, 2024 / 07:25 AM IST

గోట్లురు గ్రామంలో ఈ నెల 28న ఉచిత వైద్య శిబిరం

ATP: గోట్లురు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఈ నెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్బీ నియోజకవర్గ ఇంఛార్జ్ విష్ణు నారాయణ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కిమ్స్ సవేరా ఆస్పత్రి-అనంతపురం వారి సహాయ సహకారంతో గుండెనొప్పి, చాతినొప్పి, గుండె దడ, ఆయాసం వంటి వ్యాధులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

December 27, 2024 / 07:23 AM IST

అకాల వర్షం.. తడిచిన ధాన్యం

ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చామని.. అకాల వర్షంతో పంట తడిచిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

December 27, 2024 / 07:22 AM IST

వైసీపీవి దొంగ దీక్షలు: జీవీ ఆంజనేయులు

GNTR: జగన్ తన ఐదేళ్ల పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘ప్రభుత్వం మారే 2 నెలల ముందు కూడా ప్రజలపై జగన్ రూ.12 వేల కోట్లుపైగా భారం వేశారు. ఒక్కో ఫ్యామిలీపై సరాసరి రూ.4 వేలు అప్పు పెట్టారు. ఐదేళ్లలో ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం వేసి ఇప్పుడు ఆయన దీక్ష చేయడం హాస్యాస్పదం. అవన్నీ దొంగ దీక్షలే అన్నారు.

December 27, 2024 / 07:21 AM IST

హైదరాబాదీల మనసు గెలిచారు

HYD: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు.

December 27, 2024 / 07:20 AM IST

మన్మోహన్‌ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి

మాజీ ప్రధాని మన్మోహన్‌ మృతి పట్ల YCP అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. దేశ ప్రధానిగా పదేళ్లపాటు గొప్ప సేవలందించారని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, వర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వహించిన గొప్ప మేధావని ప్రశంసించారు.

December 27, 2024 / 07:19 AM IST

గంజాయి విక్రయిస్తున్న 12 మంది అరెస్టు

SKLM: రణస్థలం దన్నానపేట గ్రామం స్థానిక పెట్రోల్ బంక్ వెనుక భాగం లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్న 12 మందిని జే ఆర్ పురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు CI అవతారం JR పురం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. వారి నుండి 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

December 27, 2024 / 07:16 AM IST

జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య

ప్రకాశం జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

December 27, 2024 / 07:15 AM IST

ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: మామడ మండలం పరిమండల్ గ్రామంలోని భీమన్న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని అన్నారు. వీరి వెంట స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

December 27, 2024 / 07:15 AM IST

భూకంప ప్రకంపనల వల్ల భయాందోళన వద్దు

ప్రకాశం: గ్రామాల్లో తరుచూ సంబవించే భూకంపప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళన చెంద వద్దని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి. శశిధర్ తెలిపారు. తాళ్లూరు మండలపరిషత్ సమావేశం హాలులో గురువారం ఒంగోలుఆర్డీవో లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన భూకంపాలపై ప్రజ లకు అవగాహన కల్పించారు. భూమి కంపించినప్పుడు భయాందోళన చెందక ప్రశాంతంగా వుండాలని తెలిపారు.

December 27, 2024 / 07:15 AM IST

టాయ్ నోట్లతో వ్యాపారిని మోసం చేసిన యువకులు

ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు ద్వారకా తిరుమలకు చెందిన సుభాష్ అనే వ్యాపారిని నగదు రూ.2.50 లక్షలు ఇస్తే నకిలీ కరెన్సీ రూ.15 లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. అసలు నోట్లను సుభాష్ ఇచ్చి యువకుల నుంచి బ్యాగ్ను తీసుకున్నారు. టాయ్ కరెన్సీ ఉండటంతో కంగుతున్న సుభాష్ తన బ్యాగ్ను లాక్కున్నాడు. ఒకరిని పోలీసులకు అప్పగించగా మరో యువకుడు పరారయ్యాడు.

December 27, 2024 / 07:13 AM IST

నేడు రాయవరంలో విద్యుత్ అంతరాయం

కోనసీమ: రాయవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగు తుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

December 27, 2024 / 07:12 AM IST

మహారాష్ట్ర పోల్స్ .. రాహుల్ సంచలన ఆరోపణలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు కారణంగానే బీజేపీ అన్ని స్థానాలను గెలుచుకుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని 118 నియోజకవర్గాల్లో 72 లక్షల మంది కొత్త ఓటర్లు చేరటం అనుమానాలకు ఆజ్యం పోస్తుందన్నారు. ఎన్నికల ఫలితాల వెనుక సీఈసీ పాత్ర అనుమానాస్పందగా ఉందని తెలిపారు.

December 27, 2024 / 07:11 AM IST

సోన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఎస్పీ

NRML: సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి గురువారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాలని సూచించారు. ఇందులో సోను సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

December 27, 2024 / 07:11 AM IST

గురుజేపల్లిలో రెవెన్యూ సదస్సు

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని గురుజేపల్లి గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాల్లోని ప్రజలు పాల్గొని రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలపై అర్జీలను సమర్పించారు. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు మాట్లాడుతూ.. గురిజేపల్లి గ్రామంలో గ్రానైట్ గనులు, పాలిషింగ్ యూనిట్లు నెలకొల్పారన్నారు.

December 27, 2024 / 07:10 AM IST