• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

TTD కొత్త ఛైర్మన్‌ను కలిసిన MLA మురళీ

TPT: TTD కొత్త ఛైర్మన్‌గా నియమితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడును పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బోకే అందించి శాలువతో సత్కరించారు. అనంతరం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

November 4, 2024 / 03:37 PM IST

వీఓఏలను కొనసాగించాలని కలెక్టర్‌కు వినతి

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఓఏలను తొలగించారని వారిని యధావిధిగా కొనసాగించాలని ఆ సంఘం తరపున కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

November 4, 2024 / 03:37 PM IST

‘ఈనెల 6న జోనల్ లెవెల్ ఖోఖో పోటీలు’

ADB: ఈనెల 6న ఆదిలాబాద్ పట్టణంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 10 గంటలకు జోనల్ లెవెల్ ఖోఖో పోటీలు నిర్వహించడం జరుగుతుందని SGF సెక్రటరీ కాంతారావు తెలిపారు. సోమవారం నిర్వహించిన అండర్ -17 బాలికల జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన విద్యార్థులు జోనల్ లెవెల్ పోటీల్లో పాల్గొనాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు బోనాఫైడ్, ఆధార్ కార్డులతో రావాలని కోరారు.

November 4, 2024 / 03:36 PM IST

బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాణాసంచా నిషేధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో బాణాసంచా నిషేధం కొనసాగలేదని వార్తలొస్తున్నాయని, నిషేధంపై ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

November 4, 2024 / 03:36 PM IST

‘అంగన్వాడీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

NRML: గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న అంగన్వాడీల జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలను చెల్లించాలని కోరారు.

November 4, 2024 / 03:34 PM IST

డిసెంబర్ చివరికల్లా టెండర్లు పూర్తి: మంత్రి నారాయణ

AP: డిసెంబర్ చివరికల్లా అన్ని టెండర్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందన్నారు. రూ.30 వేల కోట్ల టెండర్ల పనులు మొదలయ్యాయని, మంత్రులు, జడ్జిలు, ఇతర బంగ్లాలకు రూ.41 వేల కోట్ల టెండర్లు పిలిచినట్లు తెలిపారు. జూలై 24న చీఫ్ ఇంజినీర్లతో సాంకేతిక కమిటీ వేశామన్నారు. 2014-19లో ఇచ్చిన టెండర్ పనులకు గడువు ముగిసిందన్నారు. పనులకు సంబంధించి సీఈసీ అక్టోబర్ 29న ని...

November 4, 2024 / 03:32 PM IST

జీడి ప్రవీణ్ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సామేలు

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపూరం గ్రామానికి చెందిన జీడి ప్రవీణ్ మరణించగా వారి భౌతికకాయానికి సోమవారం ఎమ్మెల్యే మందుల సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుకర్ రెడ్డి, మహారాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

November 4, 2024 / 03:31 PM IST

‘రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు’

SDPT: రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దని, రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యం కుప్పకు ఢీకొని చనిపోయిన ఘటనలు జిల్లాలో జరిగాయన్నారు. ధాన్యాన్ని రోడ్లపై పోస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

November 4, 2024 / 03:30 PM IST

IBPS ఆర్ఆర్‌బీ మెయిన్స్ ఫలితాలు విడుదల

IBPS నిర్వహించిన ఆర్ఆర్‌బీ మెయిన్స్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1,2,3 ఉద్యోగాలకు సెప్టెంబర్, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలను IBPS నిర్వహించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.

November 4, 2024 / 03:30 PM IST

హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలంటే?

హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. అండాశయ, రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల ఆరోగ్యానికి ఉపయోగకరం. ఈస్ట్రోజన్ ఉత్పత్తి, నెలసరి క్రమం తప్పకుండ...

November 4, 2024 / 03:30 PM IST

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

NRML: ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను వారు ఆదేశించారు.

November 4, 2024 / 03:29 PM IST

మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రచురణ

VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల ఓటర్ జాబితాను సోమవారం ప్రచురించారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు కార్యాలయ నోటీసు బోర్డులో ఓటర్ జాబితాను పొందుపరిచామని కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. స్థానిక సంస్థల శాసనమండలి ఒక ఎన్నిక సందర్భంగా ఓటర్ జాబితాను ప్రదర్శించినట్లు చెప్పారు.

November 4, 2024 / 03:29 PM IST

రాజకీయ నాయకుల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

VZM: ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని పాటించ‌డం ద్వారా స్థానిక సంస్థ‌ల MLC ఉప ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు అన్ని రాజ‌కీయ‌ పార్టీలు, ఎన్నిక‌లో పోటీచేసే అభ్య‌ర్ధులు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నిక‌ల అధికారి అంబేద్క‌ర్ రాజ‌కీయ పార్టీల‌కు విజ్ఞ‌ప్తి చేశారు...

November 4, 2024 / 03:27 PM IST

అధ్వానంగా ఆచంట పాలకొల్లు రహదారి

WG: ఆచంట పాలకొల్లు వయా గుమ్ములూరు వెళ్లే ఆర్ అండ్ బి రహదారి అధ్వానంగా మారింది. సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రహదారి పలుచోట్ల గోతుల ఏర్పడ్డాయి ప్రధానంగా ఆచంట సెంటర్ నుంచి సంత మార్కెట్ వరకు గుమ్మలూరు పెట్రోల్ బంక్ నుంచి పెనుమదం వరకు రహదారి పెద్ద పెద్ద గోతులతో నిండి ఉంది. తక్షణ గోతులు పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

November 4, 2024 / 03:27 PM IST

రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలుచేయాలి: రఘునందన్

SDPT: కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ PACS నూతన భవన ప్రారంభోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

November 4, 2024 / 03:27 PM IST