PLD: జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. ఫలితంగా వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. మార్చి గౌరవ వేతనం చెల్లించినా ఏప్రిల్ నుంచి రావడం లేదని, ఎంపీటీసీ సభ్యునికి రూ.3 వేలు, జెడ్పీటీసీ సభ్యునికి రూ.6 వేలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంటు విడుదల కావాల్సి ఉందని, సిఎఫ్ఎంఎ అధికారులు పేర్కొంటున్నారు.