VSP: విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంబంధిత పార్టీ సమన్వయకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.