ప్రకాశం: గిరిజన తెగలకు చెందిన ఎస్టీ కుటుంబాల వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సోమవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కనిగిరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ మాట్లాడుతూ ఎంతో కాలంగా తల దోచుకోవడానికి ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
GNTR: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 500ఏళ్లు వెనక్కి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. లాలుపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం భానుప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని విజయసాయిరెడ్డి బ్రహ్మంగారిలా జోస్యం చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ అధికారంలోకి రాదు.
NZB: పట్టభద్రుల MLC నియోజకవర్గ ఓటర్ల నమోదు గడువును పొడిగించాలని మేధావుల సంఘం ఛైర్మన్ డా.బీ కేశవులు కోరారు. సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్లు చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరేళ్ల కాలంల 5 లక్షల మందికి గ్రాడ్యుయేట్లుగా బయటకొచ్చారని, సగానికి సగం కూడా ఎన్‌రోల్ చేసుకోలేన్నారు.
SRD: ప్రభుత్వం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కార్యక్రమం నిర్వాహకులు సోమవారం కలిశారు. సదర్ సమ్మేళనం గురించి జగ్గారెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో సదర్ సమ్మేళనం కన్వీనర్ ప్రదీప్ సభ్యులు పాల్గొన్నారు.
KNR: వీణవంక మండలంలో 100 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోమవారం సంతకాలు చేసి ప్రభుత్వం వద్దకు వాటి ప్రొపోజల్స్ పంపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న 500 మందికి చెక్కులు ఇంకా అందలేదని ఎమ్మెల్యే చెప్పారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తొందరగా చెక్కులు అందించాలని డిమాండ్ చేశారు.
PLD: మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో నేడు (సోమవారం) సాధారణ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు ఛైర్మన్ పోలూరు నరసింహరావు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి రానున్నారన్నారు. సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు హాజరు కావాలని ఆయన కోరారు.
సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సోమవారం కలిశారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఎన్డీఏ సమావేశానికి హాజరైన మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిటాల శ్రీరామ్ కలిసి కరచాలనం చేశారు. అనంతరం ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రితోపాటు పరిటాల శ్రీరామ్ ఉన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఆ సమయంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో కేంద్రం పూర్తి విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్‌లో ఈ సమస్యపై పోరాడుతానని.. తనను గెలిపించాలని కోరారు. జూలైలో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తెలిసిన విషయమే. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా మృతి చెందారు.
కృష్ణా: APPSC ఛైర్‌పర్సన్ అనురాధను MLC కేఎస్ లక్ష్మణరావు సోమవారం విజయవాడలోని ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ భేటీలో గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని, గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షకు 1:100 చొప్పున ఎంపిక, DYEO పరీక్షకు కటాఫ్ మార్కుల తగ్గింపు గురించి ఆయన 3 వినతిపత్రాలు ఛైర్‌పర్సన్ అనురాధకు ఆయన అందజేశారు
JN: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సభ్యులు నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేసే విధంగా త్వరలో చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి, జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగాల పరమేశ్వర్, కమిటీ సభ్యులు తదితరులున్నారు.
AP: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలపై చర్చించారు. క్రీడల నిర్వహణ, గ్రామస్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో అధికారులు క్రీడా విధానం రూపొందించారు. పతకాలు పొందేవారికి వచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు.
GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఇటీవల అవమాన భారంతో పురుగుల మందు తాగి మృతి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి కుటుంబాన్ని సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఆర్ఎస్పీ మాట్లాడుతూ… మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పుట్టపర్తి కేంద్రంలోని ఆరామ్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కి జిల్లా టీడీపీ అంజినప్ప పుష్పగుచ్చాన్ని అందజేశారు.
SKLM: మెలియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన పెద్దింటి కృష్ణారావు నేడు విడుదలైన ఏపీ టెట్ ఎస్జీటీ ఫలితాలలో 150 మార్కులకు గాను 145.15 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. కృష్ణారావు అధిక మార్కులు సాధించడంపై తల్లిదండ్రులు అప్పలస్వామి, శాంతమ్మ ఆనందం వ్యక్తం చేశారు.