WG: మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొవ్వూరు మండలం వాడపల్లిలో గురువారం జరిగింది. వాడపల్లిలో ఓ పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడైన పాస్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.