ATP: అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను NFIW సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని.. మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ఎంపీకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో CPI మహిళా సీనియర్ నాయకురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చెన్నరావుపేట మండల సంఘం పరిధిలోని కొత్త సభ్యులకు స్వల్ప కాలిక రుణాలను సోమవారం జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించారు.రైతులు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట సొసైటీ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలోని బాలుర ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ బాల, బాలికల టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి అత్యంత అవసరమన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రీడా స్పూర్తి చాలా వరకు తగ్గిపోతోందన్నారు.
VZM: వసతి గృహంలో మృతి చెందిన బాలుడు కుటుంబానికి రూ.25 లక్షలు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు ఈశ్వర్ డిమాండ్ చేశారు. విజయనగరం కాటవీధి బీసీ వసతి గృహ విద్యార్థి శ్యామల రావు మృతి నేపథ్యంలో సోమవారం ఆప్ పార్టీ నాయకులు వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో మౌలిక వసతులను ఆయన పరిశీలించారు.
E.G: జిల్లాలో విద్యుత్ షాక్‌తో యువకుల మృతి విషాదకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం మరింత బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
HYD: మొయినాబాద్లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కోడింగ్ అకాడమీలో ప్రస్తుతం 540 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al), మెషిన్ లెర్నింగ్ (ML) రోబోటిక్స్ లాంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో మొయినాబాద్ క్యాంపస్ కోడింగ్, AI&ML విద్యకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అప్‌గ్రేడ్ అయింది.
MDK: గజ్వేల్ పట్టణంలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై అధికారులకు ఒక రోజు శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి సువర్ణ, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ హాజరై, కులగణనపై శిక్షణను కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చేపట్టిన కులగణనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వారితో గజ్వేల్ మండల అధికారులు ఉన్నారు.
MDK: గ్రంథాలయాలు విజ్ఞాన దీపికలు అని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, టివైఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ తల కొక్కుల రాజు అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌ను మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టీవైఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ తలకొక్కుల రాజు సందర్శించారు. గ్రంథాలయాలు విజ్ఞాన దీపికలు అని, గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు.
TG: జయశంకర్ వర్సిటీకి ఏ ప్రైవేట్ సంస్థతో అనుబంధం లేదని వీసీ జానయ్య స్పష్టం చేశారు. కోర్సుల నిర్వహణలో ఏ ప్రైవేట్ సంస్థతో భాగస్వామ్యం లేదని తెలిపారు. ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశామని అన్నారు. వ్యవసాయ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామని కొందరు మోసం చేస్తున్నారని, అలాంటి దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీంతో అందరి దృష్టి మెగా వేలంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో ఐపీఎల్ మెగా వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పలు నగరాల పేర్లు పరిశీలనకు వచ్చినా ఎడారి నగరం వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.
కృష్ణా: నూజివీడు మండలం అన్నవరంలో సోమవారం లారీ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని కలగలేదు. నూజివీడు వైపు నుంచి అన్నవరంలోని అట్ల ఫ్యాక్టరీకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. లారీలో నుంచి డ్రైవర్ దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
NLG: బుధవారం నుంచి చేపట్టనున్న సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై టామ్ టామ్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఆలియా మున్సిపాలిటీలో సమగ్ర కుటుంబ సర్వేపై సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సంజయ్ రాయ్ స్టేట్‌మెంట్‌ను కోర్టులో రికార్డు చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి నిందితుడు కెమెరా ముందు నోరు విప్పాడు. సీఎం మమత ప్రభుత్వం తనను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు ఆరోపించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసి హత్...
TPT: గూడూరుకు చెందిన క్రీడాకారులు తమిళనాడు ఓపన్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీలలో సత్తా చాటారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ పోటీలలో గూడూరు హెచ్‌డీ ఎరీనా స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అండర్ 15 విభాగంలో షాహిర్, అండర్ 9, అండర్ 11 విభాగాలలో యశ్విన్ ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు ఈ క్రీడల్లో ప్రతిభ కనబడటం వల్ల పలువురు వీరిని ప్రత్యేకంగా అభినందించారు.
E.G: జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.