TG: జయశంకర్ వర్సిటీకి ఏ ప్రైవేట్ సంస్థతో అనుబంధం లేదని వీసీ జానయ్య స్పష్టం చేశారు. కోర్సుల నిర్వహణలో ఏ ప్రైవేట్ సంస్థతో భాగస్వామ్యం లేదని తెలిపారు. ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశామని అన్నారు. వ్యవసాయ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామని కొందరు మోసం చేస్తున్నారని, అలాంటి దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. దీంతో అందరి దృష్టి మెగా వేలంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో ఐపీఎల్ మెగా వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పలు నగరాల పేర్లు పరిశీలనకు వచ్చినా ఎడారి నగరం వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.
కృష్ణా: నూజివీడు మండలం అన్నవరంలో సోమవారం లారీ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని కలగలేదు. నూజివీడు వైపు నుంచి అన్నవరంలోని అట్ల ఫ్యాక్టరీకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. లారీలో నుంచి డ్రైవర్ దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
NLG: బుధవారం నుంచి చేపట్టనున్న సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై టామ్ టామ్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఆలియా మున్సిపాలిటీలో సమగ్ర కుటుంబ సర్వేపై సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సంజయ్ రాయ్ స్టేట్‌మెంట్‌ను కోర్టులో రికార్డు చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి నిందితుడు కెమెరా ముందు నోరు విప్పాడు. సీఎం మమత ప్రభుత్వం తనను కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు ఆరోపించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసి హత్...
TPT: గూడూరుకు చెందిన క్రీడాకారులు తమిళనాడు ఓపన్ షటిల్ బాడ్మింటన్ క్రీడా పోటీలలో సత్తా చాటారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ పోటీలలో గూడూరు హెచ్‌డీ ఎరీనా స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అండర్ 15 విభాగంలో షాహిర్, అండర్ 9, అండర్ 11 విభాగాలలో యశ్విన్ ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు ఈ క్రీడల్లో ప్రతిభ కనబడటం వల్ల పలువురు వీరిని ప్రత్యేకంగా అభినందించారు.
E.G: జిల్లాకు చెందిన నాగమణి అనే మహిళ బహ్రెయిన్ వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన లోకేశ్ ఆమెను రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చారు. దీనిపై నాగమణి లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌లో నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. FMCG కంపెనీలు మరోసారి బిస్కెట్లు, నూనె, షాంపులు, సబ్బులు వంటి ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీల లాభాలు తగ్గాయి. దీంతో పాటు పామాయిల్, కాఫీ వంటి ధరలు పెరగడంతో తమ ప్రొడక్ట్స్ రేట్లు త్వరలోనే పెంచుతామని కొన్ని FMCG సంస్థలు పేర్కొన్నాయి. ఉత్పత్తుల ధరలను పెంచి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా లాభాలను...
PLD: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 72 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
NLG: దేవరకొండ పట్టణానికి నీటి సరఫరా జరిగే బాపూజీ నగర్ సంపు క్లీనింగ్ చేస్తున్నందున మంగళవారం పట్టణంలో నీటి సరఫరా జరగదని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. క్లీనింగ్ పూర్తి కాగానే యధావిధిగా నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
TPT: గూడూరు డివిజన్ చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ చేస్తున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
VZM: తిరుముల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఇటీవల నూతనంగా నియమితులైన బీఆర్ నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో బీఆర్ నాయుడును కలిసి దుస్సాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
HYD: హయత్ నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఐరన్ గేటు విరిగి ఓ విద్యార్థిపై పడటంతో మృతి చెందాడు. ఒకటో తరగతి బాలుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గేటుపై విద్యార్థి ఆడుతూ ఉండగా ఒక్కసారిగా అతడిపై పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా నెల్లిమర్ల నగరపంచాయతీ కార్యాలయంలో కమిషనర్ కె అప్పలరాజు సోమవారం ప్రదర్శించారు. ఎక్స్ అఫీషియో మెంబరైన ఎమ్మెల్యే, 20 మంది కౌన్సిలర్లుతో కలిపి 21 ఓట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓటరు జాబితాను కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించారు.
KRNL: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించి పెండింగ్‌లో ఉన్న 1020 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.