AP: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అమల్లోకి వచ్చేవరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్టుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు.. రెండు రాష్ట్రాల నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
AP: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 అమల్లోకి వచ్చేవరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు.. రెండు రాష్ట్రాల నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
CTR: సత్యవేడు మండలం మదనంబేడులో సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమిపూజ చేశారు. గురువారం టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు పరమశివం, మాజీ ఎంపీపీ మస్తాన్తో కలిసి భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో రోడ్లకు మహర్దశ పట్టిందని MLA తెలిపారు.
WGL: మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 457 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ రామ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ హాజరవుతారన్నారు.
TPT: మాజీ ప్రధాని మన్మోహన్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-బెల్ ప్రాజెక్టు పనులను మన్మోహన్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
తిరుపతి: ఎస్వీయూ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. పరీక్షలను పర్యవేక్షిస్తున్న హైపవర్ కమిటీ మదనపల్లె ప్రాంతంలోని పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని గుర్తించి, డీబార్ చేసినట్టు సీఈ దామ్లానాయక్ తెలిపారు.
ప్రకాశం: సంతనూతలపాడులో నిరుద్యోగ మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె. రవితేజ యాదవ్ తెలిపారు. 15 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు మూడు నెలల పాటు తర్ఫీదునిస్తామన్నారు. దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 99630 05209ను సంప్రదించాలని కోరారు.
ప్రకాశం: సీఎస్.పురం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని ఆ శాఖ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాయ బరసూల్ హాజరవుతారన్నారు.
CTR: మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీలేరులో శుక్రవారం ఉదయం 10 గంటలకు కరెంట్ ఛార్జీల పెంపుపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన కార్య దర్శి తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే తాను నాలుగు సార్లు గెలిచానని, కాబట్టి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేనని తెలిపారు. కచ్చితమైన ఆధారాలు లేనందువల్ల ఈ అంశంపై మాట్లాడకపోవడమే సరైందని భావిస్తున్నట్లు చెప్పారు.
VSP: న్యూయర్ వేడుకల భద్రతకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారి 5 గంటల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు విశాఖ సీపీ తెలిపారు. పార్క్ హోటల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద 31 రాత్రి 8 నుంచి వాహనాల నిలిపిస్తామన్నారు. RK బీచ్‌కు వచ్చే సందర్శకులు వాహనాలను జాయింట్ కలెక్టర్ బంగ్లా ప్రక్కన, గోకుల్ పార్క్‌లో చేసుకోవాలన్నారు.
E.G: సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ చిన్నారావు అన్నారు. గురువారం మాచర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన రెవిన్యూ గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి డిఎల్‌డిఒ కామేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
MDK: రామాయంపేట పట్టణంలో ప్రతిఏటా నిర్వహించే ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీ జనవరి 8 నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు మల్లేష్, ఉమామహేశ్వర్ తెలిపారు. జనవరి 8న ప్రారంభమై 19న ముగుస్తుందన్నారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు అన్ని హంగులతో టోర్నీ కొనసాగుతుందన్నారు. టోర్నమెంట్లో పాల్గొనదలచిన టీంలు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
కోనసీమ: నూకాంబికా అమ్మవారి ఆలయాన్ని మరింత అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కొత్తపేట ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు అన్నారు. ఆలయ అభివద్ధిలో భాగంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎకు ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.
SKLM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గెస్ట్ టీచరు పోస్ట్ ఖాళీ ఉందని ఐటీడీఏ పీవో సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా ఏడాదికు PGT-ఎకనామిక్స్ గెస్ట్ టీచర్ అవసరమన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన సీతంపేట ఏపీ టీ డబ్ల్యూ ఆర్‌జేసీ బాలుర పాఠశాలలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వాలన్నారు.