CTR: వరదయ్యపాలెం మండలంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 11:00 గంటలకు సంతవేలూరు ఎస్సీ హాస్టల్ పరిశీలన, 11:30 గంటలకు వరదయ్య పాలెం ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
CTR: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
HYD: ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలు కెళ్లడం ఖాయమని HYDలోని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్‌లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
VZM: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఆరు నెలల కాలంలోనే విజయనగరం పట్టణంలో వాయు కాలుష్యం సుమారు 2.5 శాతం తగ్గిందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం అమలుపై కలెక్టర్ ఛాంబర్లో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విజయనగరం పట్టణంలో జనవరి 1 నుంచి వాకింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
NRML: వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను వారు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను చూశారు. వారు మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడాలని సూచించారు.
NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్, విద్యానగర్ వీధుల్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహిస్తారని అన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజలో పాల్గొంటారు. అలాగే ఇంద్రవెల్లి మండలంలోని ధనోరాలో కొమరం భీమ్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొంటారన్నారు.
ప్రకాశం: బల్లికురవ మండలంలోని గుంటుపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామాలలో శనివారం నుంచి గతంలో నిలిచిన రీసర్వే పనులను తిరిగి ప్రారంభిస్తామని బల్లికురవ మండలం తహసిల్దార్ రవి నాయక్ తెలిపారు.రెవెన్యూ పరిధిలో ఉన్న 4573 ఎకరాలకు సంబంధించిన భూములకు ప్రత్యేక టీంల ద్వారా సర్వే చేయించి రైతులకు పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేస్తామని అన్నారు.
ASR: హుకుంపేటలో రోజు రోజుకు పెరుగుతున్న గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని, పెసా చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గిరిజనేతరులు అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
SKLM: కుంభమేళా నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-పలాస (07470), 2-2 (07471) మెమూ రైళ్లను ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు నడపబోమని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ప్రయాణించే పాసింజర్, మోమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మూడు నెలల పాటు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లాస్థాయి సైన్సు ప్రదర్శన జనవరి 3న శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో ఎస్. తిరుమల చైతన్య తెలిపారు. ఈ నెల 30న మండలస్థాయిలో వ్యక్తిగత, బృందం, ఉపాధ్యాయుల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వాటిల్లో విజేతలుగా నిలిచినవారు జిల్లా స్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు.
దేశంలో 3 కోట్లమంది రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికే దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికల్లో గెలిచాయి. రైతు ఆత్మహత్యల నివారణకు ఆయన హయాంలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోదరి హైమావతి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం సాయంత్రం సారవకోట మండలం బద్రి గ్రామంలో ఆమె తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. తన పెద్ద సోదరి మృతి చెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తమను చిన్నప్పుడు ఎంతో ఆప్యాయతతో పెంచిందని అన్నారు.
SKLM: జలుమూరు మండలంలో ఇటీవల నిర్వహించిన ఎస్సీ కులాల సర్వేకు సంబంధించిన వివరాలను సచివాలయాల వద్ద ఏర్పాటు చేశామని తహసీల్దార్ జె. రామారావు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా పలు సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎస్సీ కులాల సర్వే డేటాను ఆయన పరిశీలించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31వ తేదీలోగా తమను సంప్రదించాలన్నారు.
SKLM: పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి గురువారం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమార్చన, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శత కలశ అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సూర్యనారాయణ తెలిపారు.