వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు విషయంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పర్వతగిరి మండలం కల్లెడలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఎదుట గొడవకు దిగారు.
NRML: నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం గోదాంను సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం గోదాం వద్ద భద్రత సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. గోదాం నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
KRNL: ఈనెల 18వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PLD: సత్తెనపల్లి మండలం మొలకలూరు-గొల్లపాడు మధ్యలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య, భర్తకు గాయాలయ్యాయి. భర్తకు కాలు విరిగింది. ఇద్దరికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలు, శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీలో 21, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 11 నవంబర్ 2024 దరఖాస్తు చేసు...
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అమలాపురంలో జిల్లా ఇంఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించే ప్రభుత్వ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరు అవుతారని తెలిపారు. 3 గంటలకు పి.గన్నవరంలోని లబ్ధిదారులకు CM సహాయనిధి చెక్కులు అందిస్తారన్నారు.
కృష్ణా: కోడూరు మండలంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ రాజ్య సభ్యులు కనకమేడల రవీంద్ర పర్యటించనున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మత్స్యకారులకు ఐస్ బాక్సులు పంపిణీ, నరసింహాపురం గ్రామ సమీపంలో లింగన్నకొడుపై నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారని తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని “సాయి ఆరామ్ ఫంక్షన్ హాల్”లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో.. సోమవారం NDA ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు పరిటాల సునీత వ్యవసాయ క్షేత్రంలో పండించిన సీతాఫలం పండ్లును అందజేశారు.
TPT: కోవిడ్ సమయంలో నిలిచిన పలు రైళ్లను పునరుద్ధరించి, కొత్త రైళ్లను ఏర్పాటు చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తిరుపతికి వచ్చిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బృందాన్ని ఎంపీ కలిశారు. ఒక హోటల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఈ రైల్వే జోన్ తోడ్పడుతుందని అన్నారు.
వెల్లుల్లిలో రుచి, వాసననే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినాలి. ఇలా చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి మందులతో అవసరం లేకుండా తగ్గుతుంది. వెల్లుల్లిని పచ్చిగానే కాకుండా కూరలు, సూప్‌లు, సలాడ్‌ల...
ATP: అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ ముందు సోమవారం మునిసిపల్ కార్మికులు మౌన నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్ల కార్డ్స్‌ను చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. మేయర్ వసీం స్పందించి నగర కమిషనర్‌ను, అడిషనల్ కమిషనర్‌ను పిలిపించి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
AP: 10 లక్షల మంది జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధన సవరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమై రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలపై చర్చించారు. ‘దాదాపు రూ.40 వేల కోట్ల ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖలో నైపర్ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ వెళ్లేవారికి సీమలో ఆరోగ్య పరీక్షలు చేసేలా ఏర్పాటు కోరాను. మంత్రి సానుకూలంగా పరిశీల...
ATP: నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు 40 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 20 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డేవిడ్, సిబ్బంది పాల్గొన్నారు.
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతన పల్లెవెలుగు బస్సును ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిడుగురాళ్ల నుంచి గుంటూరుకు సర్వీస్ ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం జానపాడు రోడ్డులోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.