AP: 10 లక్షల మంది జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధన సవరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమై రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలపై చర్చించారు. ‘దాదాపు రూ.40 వేల కోట్ల ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖలో నైపర్ ఏర్పాటు చేయాలని, గల్ఫ్ వెళ్లేవారికి సీమలో ఆరోగ్య పరీక్షలు చేసేలా ఏర్పాటు కోరాను. మంత్రి సానుకూలంగా పరిశీలిస్తామన్నారు’ అని తెలిపారు.