‘కంగువ’ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్‌పై ప్రేక్షకుల నుంచి అక్కడక్కడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా స్పందించారు. ‘మేము ఎగ్జిబిటర్లతో మాట్లాడాము. థియేటర్లలో వాల్యూమ్‌ను రెండు పాయింట్లు తగ్గించమని ఎగ్జిబిటర్లను అభ్యర్థించాము. ఇది మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ పొరపాటు కాదు, సౌండ్ మిక్సింగ్ సమస్య’ అని జ్ఞానవేల్‌రాజా చెప్పారు.