ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతిచెందడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి చెందారు. ఆస్పత్రిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది శిశువులు మృతిచెందగా.. ఆస్పత్రి సిబ్బంది 37 మంది చిన్నారులను కాపాడారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.