తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ దర్శకుడు సురేష్ సంగయ్య కన్నుమూశాడు. గతకొన్ని రోజులుగా లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సురేష్ మృతిపట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2017లో ‘ఒరు కిడైయిన్ కరు మను’ సినిమాతో దర్శకుడిగా మారిన సురేష్.. గతేడాది ‘సత్య సోతనై’ అనే మూవీ తీశాడు. అంతేకాకుండా కమెడియన్ యోగిబాబుతో కూడా OTT సినిమా తెరకెక్కించాడు.