రష్యా అధ్యక్షుడు పుతిన్, బిలీనియర్ ఎలాన్ మస్క్లు 2022 నుంచి టచ్లో ఉన్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇరువురి మధ్య సంబంధాలు జాతీయ భద్రతకు ఆందోళనకరమని అమెరికా సెనెటర్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తనకు తెలుసంటూ ఎక్స్ వేదికగా మస్క్ స్పందించారు.