WNP: పాన్గల్ మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి ఈనెల 18న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి రానున్నట్లు మాజీ జడ్పీటీసీ రవి తెలిపారు. గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గ్రామ అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు, పెద్దలు, యువత సహకరించాలని కోరారు.