NLR: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సీసీ రోడ్లు, మినీ గోకులాలు నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని ఏపీవో శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీ లోపు ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. మండలంలో 23 మినీ గోకులాలు, 38 సిమెంట్ రోడ్లు మంజూరయ్యాయన్నారు.