అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని 19 వార్డులో శనివారం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్పర్సన్ భవాని, గుంతకల్ టిడిపి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.