NRML: క్రీడాకారులపై అధికారులు ఆంక్షలు విధించడం తగదని కలాం గుణం సొసైటీ సభ్యులు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ తదితర క్రీడలు ఆడుకునేందుకు తగిన రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెప్పడాన్ని నిరసిస్తూ శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు వినతి పత్రం అందించారు. స్పందించిన అదనపు కలెక్టర్ క్రీడాకారులపై ఆంక్షలు విధించవద్దని ఆదేశించారు.