హీరో ధనుష్‌పై నటి నయనతార తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడి తరపు న్యాయవాది స్పందించారు. ఈ విషయంపై ధనుష్ త్వరలోనే సమాధానం చెప్పనున్నారని వెల్లడించారు. కాగా, తనపై రాబోయే డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’లో.. తన సినిమా నానుమ్ రౌడీ సీన్స్, పాటలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ధనుష్‌పై ఆమె బహిరంగ లేఖలో విరుచుకుపడింది.