అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆ దేశం మరింత అభివృద్ధి సాదిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశమయినప్పటికీ.. దానికి ప్రపంచ భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ నేతృత్వంలో ఆర్థిక, తయారీ రంగాల్లో అగ్రరాజ్యం మరిన్ని ప్రయోజనాలు పొందుతుందని పేర్కొన్నారు.