అయోధ్య రామ మందిరాన్ని పేల్చివేస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సంస్థలు ఇవాళ ఆలయం బయట, లోపల రూట్ మార్చ్ నిర్వహించాయి. ఈ రూట్ మార్చ్‌లో సీఆర్ఫీఎఫ్, పీఎపీ, స్థానిక పోలీసు దళాలు పాల్గొన్నాయి. అంతేకాకుండా బాంబ్, డాగ్ స్క్వాడ్లను కూడా అలర్ట్ మోడ్‌లో ఉంచారు. కాగా, ఈ నెల 16,17 తేదీల్లో అయోధ్యలో వరుస పేలుళ్లు జరుగుతాయని పన్నూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.