GNTR: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని మంత్రి సవిత అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో శనివారం మెగా డీఎస్సీ శిక్షణా తరగతులను సవిత ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ తరగతులు జరుగుతాయని, అభ్యర్థులకు 2 నెలల పాటూ శిక్షణతో పాటూ రూ.4 వేల స్టై ఫండ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.