PPM: పాలకొండ నగర పంచాయతీలో వివిధ వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ ఎస్ సర్వేశ్వరరావు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య విభాగం శానిటేషన్ ఇన్స్పెక్టర్, శానిటేషన్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని గుర్తించి సుమారు 30 షాపుల వారికి అపరాధ రుసుము విధించారు.