W.G: రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మహిళా అఘోరీ తణుకులో శనివారం ప్రత్యక్షమయ్యారు. తణుకు బొమ్మల వీధిలోని రాజయోగి డాక్టర్ రాజేష్ నాత్జీ నివాసానికి ఆమె వచ్చారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను సహించబోనని, ఇలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.