తన డాక్యుమెంటరీ విషయంలో నటుడు ధనుష్ తీరును తప్పుబడుతూ నయనతార తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది. శ్రుతిహాసన్, నజ్రియా, ఐశ్వర్య లక్ష్మి, ఏక్తాకపూర్, శిల్పారావు, దియా మీర్జా, మలయాళ నటి పార్వతీ తిరువొత్తు తమ సపోర్ట్ తెలియజేశారు.