SKLM: ప్రభుత్వ ఆదేశాల మేరకు సంకల్పం అనే కార్యక్రమం పై దశలవారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆమదాలవలస ఎస్సై కే.వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమదాలవలస లక్ష్మీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామంలో రెండు చోట్ల డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, సైబర్ మోసాలు తదితర వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించామని అన్నారు.