యూపీలోని ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లోని సంబంధిత వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ ఖండించారు. హాస్పిటల్లో గత ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్, జూన్లో మాక్ డ్రిల్ నిర్వహించామని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.