హీరో ధనుష్‌పై నటి నయనతార తీవ్ర విమర్శలు చేసింది. తనపై రాబోయే డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’లో.. తన సినిమా నానుమ్ రౌడీ సీన్స్, పాటలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై బహిరంగ లేఖలో ఆమె విరుచుకుపడింది. అయితే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించగా.. నవంబరు 18న విడుదల కానుంది. విఘ్నేశ్ తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు.