TG: కేసీఆర్ పూర్తి చంద్రముఖిలా మారారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎదుట రెండే మార్గాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. రెండోది తన కుమారుడిని చాంపియన్ చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులపై దాడులను సమర్థించేస్థాయికి దిగజారారని విమర్శించారు.