AP: అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చలో మంత్రి జీవీ ఆంజనేయులు గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘పేదలు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదు.. టీడీపీ హయాంలోని లబ్ధిదారులకు లాటరీ వేసి టిడ్కో ఇళ్లు ఇచ్చారు.. గతంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసుకుని వైసీపీ కట్టినట్లు గొప్పలు చెప్పుకుంది. నిర్మాణాలను గాలికొదిలేసి పేదలను ఇబ్బంది పెట్టారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.