AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు. ఎంపీ అవినాష్ పీఏ రాఘవ ఇంటికి సెర్చ్ వారెంట్ ఇచ్చారు. అనకాపల్లిలోని రాఘవ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానందకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, రాజకీయ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిని అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే.