TG: సచివాలయంలో పలు కీలక మార్పులు చేస్తున్నారు. మెయిన్ గేట్‌ను మూసివేశారు. మెయిన్ గేట్ ప్రస్తుతం ఉన్న గేట్‌కు కొంత దూరంలో ఈశాన్యం వైపునకు మారనుంది. కొత్తగా ఏర్పాటు చేసే గేటు దగ్గర కూడా పనులకు ఇబ్బంది రాకుండా రేకులతో మూసివేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయం లోపల రోడ్డు నిర్మించడానికి గానూ పనులు చేస్తున్నారు.