W.G: భీమవరం ఆర్టీసీ డిపో సమీపాన వ్యభిచార గృహంపై శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే గుర్తు చప్పుడు కాకుండా వ్యభిచారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు