దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలోని సరోజిని నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన బస్ డిపోను మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే ఉన్నారు. ప్రస్తుతం ఈ డిపోలో మొత్తం 225 మంది సిబ్బందిని అధికారులు కేటాయించారు.