ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వచ్చాయి. తన భార్య రెండో బిడ్డ ప్రసవానికి అందుబాటులో ఉండేందుకు సెలవు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రోహిత్ భార్య రితికా శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి టెస్టుకు ఇంకా 6 రోజుల సమయం ఉండటంతో.. రోహిత్ త్వరలోనే జట్టుతో చేరుతాడని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.