మహారాష్ట్రలోని చంద్రాపూర్ నియోజకవర్గం గుగూస్లో CM రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం రుణమాపీ, ఉచిత బస్సు, ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. వారు ఇరువురు గుజరాత్ గులాంలుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు.