ఆన్లైన్ మోసాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వీటిని ఆరికట్టేందుకు UK టెలికం కంపెనీ ‘ఓ2’ అనే ప్రయోగంతో ముందుకొచ్చింది. ‘డైసీ’ అనే ఏఐ బామ్మను సృష్టించింది. ఈ ఏఐ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతోంది. వారితో నిజంగా మనిషిలాగే మాట్లాడుతూ.. వారి సమయాన్ని వృథా చేస్తూ సమాచారం తెలసుకుంటుంది. ఇలా దాదాపుగా 40 నిమిషాల పాటు మాట్లాడుతుంది. ఇలా నేరగాళ్లకు విసుగు తెప్పిస్తోంది.